వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో రోహిత్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడ్డారు. వారిలో కొందరూ కోలుకుని...పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ - తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి కరోనా పాజిటివ్
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా బారిన పడ్డారు. అధికార పార్టీ తెరాసకు చెందిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి వైరస్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
corona-positive