తెలంగాణ రాజ్‌భవన్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. 28 మంది పోలీసులకు కోవిడ్ నిర్ధరణ అయ్యింది. సిబ్బందిలో మరో 10 మందికి కరోనా సోకినట్టు ఫలితాలు వచ్చాయి. వీరు మాత్రమే కాక... సిబ్బంది కుటుంబీకుల్లో మరో 10 మందికి వైరస్ పాజిటివ్ గా నిర్ధరణ అయ్యింది. బాధితులకు ఎస్.ఆర్.నగర్ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణ రాజ్‌భవన్‌లో మొత్తం 395 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 347 మందికి నెగెటివ్‌గా ఫలితం వచ్చింది. తెలంగాణ గవర్నర్ సహా అధికారులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. తనకు నెగటివ్ గా వచ్చినట్టు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేసి తెలిపారు.