ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: జియాగూడలో మరో 20 కరోనా పాజిటివ్​ కేసులు - telengana news

హైదరాబాద్​లోని జియాగూడలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఆదివారం మరో 20 కొవిడ్​-19 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి.

JIYAGUDA 20 CASES
తెలంగాణ: జియాగూడలో మరో 20 కరోనా పాజిటివ్​ కేసులు

By

Published : Jun 1, 2020, 1:02 PM IST

హైదరాబాద్​ కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జియాగూడలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఆదివారం మరో 20 మందికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ అయింది. గత ఇరవై రోజుల క్రితం జియాగూడలోని కొన్ని కుటుంబాలు పహాడీ షరీఫ్​లోని వారి బంధువుల ఇంటికి వెళ్లి వచ్చారు. పహాడీ షరీఫ్​లో కరోనా కేసులు పెరగడం వల్ల అనుమానం వచ్చిన వారు పరీక్షలు చేయించుకోగా అందులో తొమ్మిది మందికి కరోనా సోకినట్లు తేలింది.

దీనితోపాటు నగరంలోని వివిధ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న జియాగూడకు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధరణ జరిగింది. వారితో పాటు కుల్సుంపూర పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్​కి కూడా కరోనా సోకింది. వీరితో పాటు జియాగూడలోని వివిధ కాలనీలకు చెందిన ఏడుగురికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్​ నిర్ధరణ జరిగిందని అధికారులు తెలిపారు.

ఇది చదవండిరాష్ట్రంలో కొత్తగా 98 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details