ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా తాజా బులెటిన్: ఏడుగురికి పాజిటివ్ - రాష్ట్రంలో ఏడుగురికి కరోనా పాజిటివ్

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు పెరిగింది. బాధితుల్లో ఒకరు కోలుకుని.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు తాజాగా విడుదల చేసిన బులెటిన్ లో వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

corona positive cases in ap
corona positive cases in ap

By

Published : Mar 24, 2020, 9:02 AM IST

కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ.. తాజా బులెటిన్‌ విడుదల చేసింది. కరోనా పాజిటివ్‌ కేసులు ఏడుకు పెరిగినట్టు తెలిపింది. ఆస్పత్రి నుంచి ఓ బాధితుడు కోలుకున్నాడని.. డిశ్చార్జ్ చేశామని ప్రకటించింది. బులెటిన్ లో ఉన్న వివరాల ప్రకారం.. విశాఖ విమానాశ్రయం, పోర్టుల నుంచి వచ్చిన 12,082 మందికి అధికారులు స్క్రీనింగ్ పూర్తి చేశారు. అలాగే.. రాష్ట్రానికి 14,038 మంది విదేశీ ప్రయాణికులు వచ్చినట్టు గుర్తించారు. అందులో.. 2426 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయింది. ప్రస్తుతం హోమ్‌ ఐసోలేషన్‌లో 11,526 మంది ఉన్నారు. 86 మందిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 220 మంది నమూనాలు పరీక్షలకు పంపించగా.. ఏడుగురికి పాజిటివ్‌, 168 మందికి నెగిటివ్‌గా తేలింది. మరో 45 మంది నమూనాల ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లురు, చిత్తూరు జిల్లాల్లో మార్చి 31 వరకు 144 సెక్షన్‌ అమలవుతుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details