ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు - ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు

corona positive cases in ap state
రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

By

Published : Apr 25, 2020, 11:52 AM IST

Updated : Apr 25, 2020, 2:30 PM IST

11:51 April 25

రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వెయ్యిదాటింది. కొత్తగా 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.... మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరింది. శ్రీకాకుళం జిల్లాలో తొలిసారిగా మూడు కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 171 మంది డిశ్చార్జికాగా... 31 మంది మృతి చెందారు. 

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరింది. కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మృతి చెందగా... మొత్తం మరణాల సంఖ్య 31కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 814మంది చికిత్స పొందుతున్నారు. 

కృష్ణా జిల్లాలో ఒకేరోజు 25 కేసులు నమోదు కావటంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 127కు చేరింది. ఇప్పటివరకూ 29 మంది డిశ్చార్జి కాగా... 90 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఒకరు మరణించటంతో... జిల్లాలో మొత్తం మృతుల సంఖ్య 8కి చేరిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. వరుసగా రెండో రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదు కావటంతో జిల్లా యంత్రాంగం మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. 

మొత్తం కేసుల సంఖ్యలో ప్రథమ స్థానంలో ఉన్న కర్నూలు జిల్లాలో ఒకేరోజు 14 కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 275కు చేరింది. ఇప్పటికే ఏడుగురు కోలుకుని ఇళ్లకు చేరుకోగా... 259 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఒకరు మరణించటంతో... జిల్లాలో కరోనా మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. 

అనంతపురం జిల్లాలో ఒకేరోజు ఐదు పాజిటివ్ కేసులుకాగా... మొత్తం కేసుల సంఖ్య 51కి చేరింది. ఇప్పటివరకూ కోలుకుని 13 మంది డిశ్చార్జి అయ్యారు. 34 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో మొత్తం నలుగురు మరణించారు. జిల్లా వ్యాప్తంగా కఠిన నిబంధనలు అమలుచేస్తున్న అధికారులు... రెండురోజులుగా పాజిటివ్‌ కేసులు నమోదు కావటంతో... మరిన్ని చర్యలకు సిద్ధమయ్యారు. 

కడప జిల్లాలో నాలుగు కేసులు నమోదు కావటంతో... మొత్తం కేసుల సంఖ్య 55కు పెరిగింది. ఇప్పటివరకూ 28 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 27 మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకూ ఒక్క మృతీ నమోదు కాలేదు. 

నెల్లూరులో నాలుగు కేసులు నమోదు కావటం వల్ల... మొత్తం కేసుల సంఖ్య 72కు చేరిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. 8 మంది ఇదివరకే కోలుకోగా... 63 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకూ 8 మంది మరణించారు. 

శ్రీకాకుళం జిల్లాలో తొలిసారిగా మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ఉద్ధృతం చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి మరిన్ని ఆంక్షలు అమలు చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. 

గుంటూరు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 209కు పెరిగింది. ఇదివరకే 23 మంది కోలుకోగా... 178మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో 8 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటికే లాక్‌డౌన్‌ కఠినంగా అమలుచేస్తున్న అధికారులు... ఉదయం గంటల తరువాత బయటకు వచ్చేవారిపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు.

తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 37కు పెరిగింది. 12 మంది డిశ్చార్జి అయ్యారని, 25 మంది చికిత్స పొందుతన్నారని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. చిత్తూరు, ప్రకాశం, విశాఖ, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో తాజాగా కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. 

ఇవీ చదవండి:కడసారి చూపు లేకుండానే... గంటల్లో శవం మాయం
 

Last Updated : Apr 25, 2020, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details