తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యత్నారం అనే అటవీ గ్రామంలో 3 రోజుల్లోనే 34 మంది కరోనా బారిన పడ్డారు. ఒక్కో కుటుంబంలో ఇద్దరు నుంచి నలుగురికి కొవిడ్ సోకింది. ఇళ్లలో ఉంటే మరికొందరికి వైరస్ సోకుతుందన్న ఉద్దేశంతో ఏడు కుటుంబాలకు చెందిన 20 మంది గ్రామశివారులోని అటవీ ప్రాంతాన్నే ఐసొలేషన్(Isolation)గా ఎంచుకున్నారు.
ISOLATION: అడవే ఐసోలేషన్... చెట్ల కిందే నివాసం - isolation centers in bhupalpally district
కరోనా మహమ్మారి సోకిన వారిని కొందరు గ్రామాల్లోంచి వెలి వేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కుటుంబ సభ్యులకు సోకుతుందనే భయంతో.. బాధితులే ఇళ్ల నుంచి బయటకొస్తున్నారు. తన వాళ్లకు వైరస్ సోకకూడదని కొందరు కరోనా బాధితులు ఇల్లు వదిలి అడవి బాట పట్టారు. అడవినే ఐసోలేషన్(Isolation) కేంద్రంగా చేసుకున్నారు.
![ISOLATION: అడవే ఐసోలేషన్... చెట్ల కిందే నివాసం isolation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11996349-184-11996349-1622685989542.jpg)
అడవే ఐసోలేషన్
కొంత మంది అక్కడే వంట చేసుకుంటుండగా.. మరికొంత మందికి కుటుంబసభ్యులు ఇంటి నుంచి ఆహారం పంపిస్తున్నారు. తమ వద్దకు అధికారులు, నాయకులు రాలేదని వారు తెలిపారు.