పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కరోనా బాధితుడు హల్చల్ సృష్టించాడు. రామగుండానికి చెందిన వ్యక్తికి గురువారం కరోనా పాజిటివ్ రావడం వల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
తెలంగాణ :పెద్దపల్లి ఆసుపత్రిలో కరోనా రోగి హల్చల్ - carona patient
తెలంగాణలోని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో కరోనా రోగి హల్చల్ చేశాడు. తాను ఇంటికి పోతానంటూ ఆసుపత్రి ఆవరణలోకి వచ్చి... వైద్య సిబ్బందిని ఇబ్బంది పెట్టాడు.
పెద్దపల్లి ఆసుపత్రిలో కరోనా రోగి హల్చల్
గురువారం రాత్రి .. తాను ఇంటికి వెళ్లిపోతానని దుస్తుల సంచితో అతను బయల్దేరడంతో వైద్య సిబ్బంది ఆందోళన చెందారు. ఐసోలేషన్ వార్డు నుంచి ప్రభుత్వాసుపత్రి ఆవరణలోకి వచ్చి.. గంటసేపు ఇబ్బంది పెట్టాడు. చివరకు శుక్రవారం ఇంటికి పంపిస్తామని పెద్దపల్లి ఎస్సై రాజేష్‌తో పాటు వైద్యసిబ్బంది వారించడం వల్ల ఐసోలేషన్ వార్డులోపలికి వెళ్లిపోయాడు. దీనితో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చూడండి:ప్రమాదంలో పర్యావరణం.. కాగితాల్లోనే నిబంధనలు