ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో 180 మందికి కరోనా పాటిజివ్‌ - covid cases in police academy

తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. శిక్షణ ఎస్ఐలతో పాటు సిబ్బంది కలిపి.. దాదాపు 180 మందికి కొవిడ్ సోకింది.

corona-pandemic-attacks-police-academy-in-hyderabad
రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో 180 మందికి కరోనా పాటిజివ్‌

By

Published : Jun 28, 2020, 5:54 PM IST

తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో కరోనా కలకలం సృష్టించింది. దాదాపు 180 మందికి కరోనా పాటిజివ్‌గా తేలింది. అందులో 100 మంది శిక్షణ ఎస్సైలు, 80 మంది సిబ్బంది ఉన్నారు. కొవిడ్‌ బాధిత అధికారులను అకాడమీలోనే ఐసోలేషన్‌లో ఉంచారు. తాజా కేసులతో ఆకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఎస్సైలు, కానిస్టేబుళ్లు ఆందోళన చెందుతున్నారు. అకాడమీలో పనిచేస్తున్న ఐపీఎస్‌ అధికారితోపాటు ఇతర అధికారులు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు.

బాధితుల్లో కరోనా లక్షణాలు కనిపించనప్పటికీ... కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ కారణంగా.. అక్కడ ఉంటున్న అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. శిక్షణ పొందుతున్న 1100కు పైగా ఎస్సైలు, 600 కుపైగా కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బందితో కలుపుకుని అకాడమీలో దాదాపు 2200 మంది ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details