ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌ - telangana varthalu

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన ర్యాపిడ్ పరీక్షల్లో ఆయనకు నెగటివ్ నిర్ధరణ అయింది. ఆర్టీపీసీఆర్ ఫలితాలు రేపు రానున్నాయి.

cm kcr covid negative
cm kcr covid negative

By

Published : Apr 28, 2021, 8:34 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలో సీఎంకు కొవిడ్ నెగెటివ్ నిర్ధరణ అయింది. స్వల్ప లక్షణాలతో ఈ నెల 19న కేసీఆర్ కొవిడ్ పరీక్ష చేసుకోగా... పాజిటివ్ వచ్చింది. అప్పట్నుంచి వైద్యుల సూచన మేరకు సీఎం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్​లో ఉన్నారు. వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని పరీక్షిస్తోంది.

మధ్యలో ఒకసారి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో సీటీ స్కాన్ సహా ఇతర పరీక్షలు చేసుకున్నారు. ఛాతీలో ఎలాంటి ఇన్​ఫెక్షన్ లేదని సీటీ స్కాన్​లో తేలినట్లు వైద్యులు తెలిపారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్​కు మరోమారు పరీక్షలు నిర్వహించారు. ర్యాపిడ్ యాంటీజెన్​తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ర్యాపిడ్ టెస్ట్​లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆర్టీపీసీఆర్ ఫలితాలు రేపు రానున్నాయి.

ఇదీ చదవండి:రాష్ట్రంలో ఆక్సిజన్, రెమ్​డెసివిర్​ కొరత లేదు : సింఘాల్

ABOUT THE AUTHOR

...view details