ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 295 కరోనా కేసులు, ఒకరి మృతి - కొత్త కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 295 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 368 మంది కోలుకోగా.. ఒక్కరు మరణించారు. మరో 2,822 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

carona bulletin
రాష్ట్రంలో కొత్తగా 295 కరోనా కేసులు

By

Published : Jan 7, 2021, 9:09 PM IST

రాష్ట్రంలో గత 24 గంటల్లో 59,410 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 295 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 368 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా.. కృష్ణా జిల్లాల్లో ఒక్కరు మరణించారు.

కృష్ణాలో అత్యధికంగా 45.. విజయనగరంలో అత్యల్పంగా నలుగురికి కొవిడ్ నిర్ధారణ జరిగింది. చిత్తూరులో 39, గుంటూరులో 35, తూర్పు గోదావరిలో 32, కడపలో 10, విశాఖపట్నంలో 22, అనంతపురంలో 30, శ్రీకాకుళంలో 9, నెల్లూరులో 24, ప్రకాశంలో 12, పశ్చిమగోదావరిలో 21, కర్నూలులో 12 మంది వైరస్ బారిన పడ్డారు.

మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకు కోటీ 21 లక్షల మందికి పైగా కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. 8,84,171 మందికి కరోనా సోకినట్లు వెల్లడించింది. 8,74,223 మందికి పైగా మహమ్మారి నుంచి కోలుకోగా.. 7,126 మంది మృతి చెందారని వివరించింది. 2,822 మంది వైరస్ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది.

ఇదీ చదవండి:

యూకే స్ట్రెయిన్ కట్టడికి ప్రభుత్వం చర్యలు...

ABOUT THE AUTHOR

...view details