రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,680 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 88 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,89,298కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.
శుక్రవారం (21.02.21) వరకు మొత్తం మరణాల సంఖ్య 7,167గా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 72 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. వీరితో కలిపి రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8 లక్షల 81 వేలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 620 యాక్టివ్ కేసులున్నాయి.