ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 51 కరోనా కేసులు.. ఇద్దరు మృతి - కరోనా తాజా సమాచారం

రాష్ట్రంలో కొత్తగా 51 మంది.. కరోనా బారిన పడినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నూతనంగా నమోదైన కేసులతో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ బాధితుల సంఖ్య 8 లక్షల 86 వేల 115 కి చేరింది.

corona-latest-updates-in-andhrapradesh
రాష్ట్రంలో కొత్తగా 51 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

By

Published : Feb 17, 2021, 7:47 PM IST

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 51 మందికి కొవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ బారినపడ్డ వారి సంఖ్య 8 లక్షల 86 వేల 115 కి చేరిందని వెల్లడించింది. తాజాగా.. కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందగా... మహమ్మారి ప్రభావంతో ఇప్పటివరకు 7,165 మంది మృతి చెందినట్లు వివరించింది.

మరోవైపు.. గడిచిన 24 గంటల్లో 57 మంది కొవిడ్​ నుంచి కోలుకోగా.. మెుత్తం కోలుకున్నవారి సంఖ్య 8,78,343 లక్షలకు పైగా చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కోటి 36 లక్షల 15 వేల 847 కరోనా నిర్ధరణ పరీక్షలు చేసినట్లుగా తాజా బులెటిన్​లో వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో కొత్తగా 51 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

ఇదీ చదవండి:

పల్లె పోరు: మూడో విడత పోలింగ్​ శాతం వివరాలు ఇవే..

ABOUT THE AUTHOR

...view details