ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో 2 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

corona-latest-update-from-andhra-pradesh
రాష్ట్రంలో 2 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

By

Published : Aug 7, 2020, 7:37 PM IST

Updated : Aug 7, 2020, 7:49 PM IST

19:25 August 07

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. 24 గంటల వ్యవధిలో 10,171 కరోనా కేసులు నమోదు కాగా... 89 మంది మృతిచెందారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,331 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో కరోనాతో మరో 10 మంది మృతిచెందారు.

రాష్ట్రంలో 2 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 2 లక్షలు దాటాయి. 24 గంటల వ్యవధిలో 10,171 కరోనా కేసులు నమోదు కాగా... మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,960కి చేరింది. కరోనాతో మరో 89 మంది మృతిచెందారు. కొవిడ్​తో ఇప్పటివరకు 1,842 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో కరోనా నుంచి 1,20,464 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 84,654 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 62,938 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 23.62 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.  

జిల్లాల వారీగా కేసులు...

కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,331 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరిలో 1,270, అనంతపురంలో 1,100, చిత్తూరులో 980, నెల్లూరులో 941, విశాఖలో 852, గుంటూరులో 817, కడపలో 596, పశ్చిమగోదావరిలో 548, విజయనగరంలో 530, శ్రీకాకుళంలో 449, కృష్ణాలో 420, ప్రకాశం జిల్లాలో 337లో కరోనా కేసులు నమోదయ్యాయి.

కరోనా మృతులు...

చిత్తూరు జిల్లాలో కరోనాతో మరో 10 మంది మృతిచెందారు. అనంతపురం, గుంటూరు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 9 మంది చొప్పున మరణించారు. కడప, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలో ఏడుగురు చొప్పున మృతిచెందారు. కృష్ణా జిల్లాలో 6, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృత్యువాతపడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతిచెందారు.

ఇదీ చదవండీ... 'ప్రజలకు వైద్యం అందనప్పుడు- ప్రభుత్వం ఉండి ఏం లాభం'

Last Updated : Aug 7, 2020, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details