ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 50 మందికి కరోనా.. ఒకరు మృతి - కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 50 మందికి కొవిడ్ నిర్ధారణ జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 121 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా.. ఒకరు మహమ్మారికి బలయ్యారని పేర్కొంది. తాజా కేసులతో కలిపి.. ఏపీలో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 8,88,605కి చేరిందని ప్రకటించింది.

corona latest bulletin of AP
రాష్ట్రంలో కొత్తగా 50 మందికి కరోనా.. ఒకరు మృతి

By

Published : Feb 10, 2021, 7:54 PM IST

గత 24 గంటల్లో రాష్ట్రంలో 28,418 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 50 మందికి వైరస్ సోకిందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 121 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ఒక్కరు మరణించారని వెల్లడించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కోటీ 34 లక్షలకు పైగా నమూనాలను పరీక్షించగా.. మొత్తం 8,88,605 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో 8.8 లక్షల మంది బాధితులు వైరస్​ నుంచి పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇప్పటివరకు మెుత్తం 7,161 మంది మహమ్మారి ధాటికి మరణించారు.

రాష్ట్రంలో కొత్తగా 50 మందికి కరోనా.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details