ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CCMB On Covid: 'కొవిడ్‌ రోగులు ఎక్కువ మంది ఉన్న చోట అధికవ్యాప్తి' - Ccmb latest updates

CCMB On Covid: గాలి ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మైక్రోబయోలజీ పరిశోధనలలో తేలింది. గతంలో రోగి అంటుకున్న వస్తువులు, ఉపరితలాల ద్వరా కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉందని ఎపిడెమియాలజిస్ట్ తెలిపారు.

CCMB On Covid
CCMB On Covid

By

Published : May 4, 2022, 4:26 PM IST

CCMB On Covid: కరోనా వైరస్‌ సార్స్‌ కోవ్‌-2 ఎలా వ్యాపిస్తుందనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. ఉపరితలాల ద్వారా వ్యాపిస్తుందని అంటువ్యాధుల పరిశోధకులు మొదట భావించారు. జాగ్రత్తలు తీసుకున్నా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉండటంతో గాలి ద్వారా వ్యాపిస్తుందని అంచనాకు వచ్చారు. దీనిపై సీసీఎంబీ, చండీగఢ్‌లోని ఐఎంటెక్‌లు మరింత లోతుగా అధ్యయనం చేశాయి. ఆసుపత్రులతో కలిసి చేపట్టిన సంయుక్త పరిశోధనలో.. గాలిలోని కరోనా వైరస్‌ కణాలు మనుషులకు సోకుతాయని గుర్తించారు. ఇందుకు కొవిడ్‌ రోగులున్న హైదరాబాద్‌, మొహలీలలోని ఆసుపత్రులు, కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్న మూసిఉంచిన గదులు, హోం క్వారంటైన్‌ ఉన్న నివాసాల్లో సేకరించిన గాలి నమూనాల నుంచి కరోనా వైరస్‌ జన్యు పదార్థాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

తేలిన అంశాలు..

* కొవిడ్‌ రోగుల చుట్టూ ఉన్న గాలిలో వైరస్‌ తరచూ కనిపించింది.

* ప్రాంగణంలో రోగుల సంఖ్య పెరిగే కొద్దీ పాజిటివిటీ రేటు పెరిగింది.

* ఐసీయూలోనే కాదు ఇతర వార్డుల్లోని గాలిలోనూ కరోనా వైరస్‌ ఉంది.

* ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతతో సంబంధం లేకుండా రోగులు గాలిలోకి వైరస్‌ను వ్యాప్తి చేశారు.

* గాలిలో వైరస్‌ చాలా దూరం వరకు వ్యాప్తి చెందింది.

ఈ పరిశోధన ఫలితాలు తాజాగా ఏరో సోల్‌ సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

మూసి ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ సేపు..

‘కరోనా వైరస్‌.. మూసి ఉన్న ప్రదేశాల్లో, గాలి వెలుతురు సరిగ్గా ఆడని చోట కొంత సమయం పాటు గాలిలో ఉంటుందని మా ఫలితాలు చూపిస్తున్నాయి. ఒక గదిలో ఇద్దరు, అంతకన్నా ఎక్కువ మంది కొవిడ్‌ రోగులు ఉన్నప్పుడు గాలిలో వైరస్‌ పాజిటివిటీ రేటు 75 శాతంగా ఉందని కనుగొన్నాం. ఒక్కరు ఉన్నప్పుడు 15.8 శాతం ఉంది. రోగులు ఎక్కువగా చికిత్స పొందే ఆసుపత్రుల్లోని ఇన్‌డోర్‌ వాతావరణంలో గాలిలో కరోనా వైరస్‌ ఎక్కువగా ఉంది’ అని అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్‌ శివరంజని మోహరిర్‌ చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా మాస్కులు ధరించాలని సూచించారు.

తేనెటీగల విషంతో చికిత్స..

కొవిడ్‌ చికిత్సకు ఉపయోగపడే యాంటీ బ్యాక్టీరియల్‌ పెప్టైడ్స్‌ తేనెటీగల విషంలో ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధకులు గుర్తించారు. ప్రయోగశాలలోని వైరస్‌పై ప్రయోగించగా అవి వైరస్‌ లోడును తగ్గించినట్లు కనుగొన్నారు. 12 నుంచి 24 గంటల వ్యవధిలోనే వైరస్‌ తగ్గిపోయినట్లు తేల్చారు. తేనెటీగలు కుట్టినప్పుడు విసర్జించే పదార్థం ఎంజైమ్‌లు, షుగర్‌లు, మినరల్స్‌, అమైనో యాసిడ్‌లను కలిగిఉంటుంది. అమైనో యాసిడ్‌లోని పెప్టైడ్స్‌పై సీసీఎంబీ పరిశోధనలు చేసింది. వీటి ఫలితాలు తాజాగా నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ఇవీ చూడండి:

కరోనా కలవరం.. దేశంలో మళ్లీ పెరిగిన కేసులు, మరణాలు

RCB vs CSK: ఆటలో వీళ్లు టాప్.. హాట్​నెస్​లో భార్యలు తోప్!

ఆమె కోసమే నేపాల్​కు రాహుల్​.. అందుకే ఇన్ని వివాదాలు!

పెళ్లి పీటలెక్కిన 'జబర్దస్త్​' జోడీ రాకింగ్​ రాకేశ్​-సుజాత!

ABOUT THE AUTHOR

...view details