ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హాట్​స్పాట్​లివే...! - telangana hotspot

దేశవ్యాప్తంగా కరోనా హాట్​స్పాట్​ల జాబితాను కేంద్రం ఆయా రాష్ట్రాలకు పంపింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల్లోని 19 జిల్లాలు ఉన్నాయి. ఏపీలో 11 జిల్లాలు, తెలంగాణలో 8 జిల్లాలను హాట్​స్పాట్​లుగా గుర్తిస్తూ కేంద్రం జాబితా విడుదల చేసింది.

corona-hotspots-in-telugu-states
తెలుగు రాష్ట్రాల్లో కరోనా హాట్​స్పాట్​లివే...!

By

Published : Apr 15, 2020, 7:25 PM IST

Updated : Apr 15, 2020, 8:28 PM IST

దేశవ్యాప్తంగా కరోనా హాట్‌స్పాట్‌ల జాబితాను కేంద్రం విడుదల చేసింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకోవాలని అన్ని రాష్ట్రాల సీఎస్‌లను కోరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాష్ట్రాలకు ప్రత్యేక లేఖలు రాశారు. హాట్​స్పాట్​ల​ జాబితాలను కేంద్రం ఆయా రాష్ట్రాలకు పంపింది. 28 రోజుల పాటు ఆ హాట్​స్పాట్​లలో ఒక్క కేసు నమోదు కాని పక్షంలో గ్రీన్‌జోన్‌లోకి మారుస్తామని కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో 19 జిల్లాలను హాట్​స్పాట్​లుగా కేంద్రం గుర్తించింది. ఏపీలో 11, తెలంగాణలో 8 హాట్​స్పాట్​ జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో...

ఆంధ్రప్రదేశ్​లో విజయనగరం, శ్రీకాకుళం మినహా 11 జిల్లాలను కేంద్రం హాట్​స్పాట్​ల జాబితాలో చేర్చింది. తెలంగాణలో హైదరాబాద్​, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి అర్బన్, గద్వాల, మేడ్చల్, కరీంనగర్, నిర్మల్ జిల్లాలను హాట్​స్పాట్​లుగా గుర్తించింది.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ర్యాండమ్​ టెస్టులు

Last Updated : Apr 15, 2020, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details