గత 24 గంటల్లో.. రాష్ట్రంలో 218 మందికి కరోనా సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా చిత్తూరులో 63, అత్యల్పంగా ప్రకాశంలో 2 కేసులు నమోదయ్యాయి. వీటితో ఏపీలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 8,92,740కి చేరింది. 1,795 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 117 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరణాలేమీ సంభవించలేదని అధికారులు ప్రకటించారు.
రాష్ట్రంలో కొత్తగా 218 కరోనా కేసులు - 18.03.2021న రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు
కొత్తగా రాష్ట్రంలో 218 కొవిడ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 117 మంది కోలుకోగా.. ఒక్కరూ మరణించలేదని వెల్లడించింది. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటివరకు మొత్తం బాధితుల సంఖ్య 8,92,740కి చేరినట్లు తెలిపింది.
రాష్ట్రంలో కొత్తగా 218 కరోనా కేసులు
గుంటూరులో 24, తూర్పుగోదావరిలో 23, కృష్ణా కడపలో 21, కర్నూలులో 18, విశాఖ అనంతపురంలో 13, శ్రీకాకుళం విజయనగరంలో 6, నెల్లూరులో 5, పశ్చిమగోదావరిలో 3 చొప్పున తాజాగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల ఇప్పటివరకు 7,186 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ.. హై కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్