రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరిగిపోతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 2,331 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరులో అత్యధికంగా 368, పశ్చిమగోదావరిలో అత్యల్పంగా 20 మందికి మహమ్మారి సోకింది. 853 మంది కోలుకున్నారు.. 11 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో నలుగురు, కర్నూలులో ఇద్దరు, తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖ, నెల్లూరు, అనంతపురంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
తాజా లెక్కలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కొవిడ్ బాధితుల సంఖ్య 9,13,274కి చేరింది. 8,92,736 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 13,276 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 7,262 మంది ప్రాణాలు కోల్పోయారు.