ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్‌ టూ ఛత్తీస్‌గఢ్.. ఐదుగురికి కరోనా - corona in chatisgarh

హైదరాబాద్​ నుంచి ఛత్తీస్‌గఢ్‌ వెళ్లిన ఐదుగురికి కరోనా పాజిటివ్​ సోకింది. వివిధ రాష్ట్రాల నుంచి ఛత్తీస్​గఢ్​లోని తమ సొంత ప్రాంతాలకు చేరుకున్న వలస కూలీలకు అక్కడి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించగా.. 14 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఇందులో ఓ ఐదుగురు హైదరాబాద్​ నుంచి గత పది రోజులుగా నడుచుకుంటూ.. దారిలో కనిపించిన వారిని లిఫ్ట్ అడుగుతూ ఛత్తీస్​గఢ్ చేరుకున్నట్లుగా గుర్తించినట్టు తెలుస్తోంది.

corona to migrants who went to chattisgarh from hyderabad
హైదరాబాద్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ వెళ్లిన ఐదుగురికి కరోనా

By

Published : May 5, 2020, 12:25 PM IST

హైదరాబాద్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్‌ జిల్లాకు వెళ్లిన ఐదుగురికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వివిధ రాష్ట్రాల నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని తమ సొంత ప్రాంతాలకు చేరుకున్న వలస కూలీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది. వారిలో 14 మందికి కరోనా సోకినట్లు వెల్లడైంది. ఫలితంగా బాధితులతో సన్నిహితంగా ఉన్న 200 మందిని అధికారులు క్వారంటైన్‌కు పంపారు.

14 మంది బాధితుల్లో ఆరుగురు కబీర్‌ధామ్‌ జిల్లాకు చెందినవారని అధికారులు తెలిపారు. ఆ ఆరుగురిలో ఐదుగురు హైదరాబాద్‌ నుంచి వచ్చారని, వారిలో నాలుగేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు వివరించారు. హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన వీరు 10 రోజులుగా నడుచుకుంటూ, దారిలో కనిపించిన వారిని లిప్ట్‌ అడుగుతూ ఛత్తీస్‌గఢ్‌ చేరుకున్నారని గుర్తించినట్టు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details