యూకే నుంచి తెలంగాణకు తిరిగి వచ్చిన వారిలో 16 మందిలో కరోనా నిర్ధరణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హైదరాబాద్కి చెందిన 4, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నుంచి 4, జగిత్యాల 2 , మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాల నుంచి ఒక్కొక్కరికి పాజిటివ్ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ ప్రకటించారు.
వీరిలో కొత్త రకం వైరస్ ఉందా లేదా అన్న విషయాలను నిర్ధరించేందుకు నమూనాలను సీసీఎంబీకి పంపినట్లు చెప్పారు. మరో రెండు రోజుల్లో ఫలితాలు రానున్నట్లు సమాచారం. ఇక డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు యూకే నుంచి 1200 మంది రాష్ట్రానికి రాగా వారిలో 926 మందిని గుర్తించి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా అందులో కేవలం 16 మందికి మాత్రమే వైరస్ సోకినట్లు ఆయన ప్రకటించారు.