ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో ఉచితంగా కరోనా చికిత్స

corona fee in aarogyasri-network-hospitols
అరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో కరోనాతు ఫీజు ఖరారు

By

Published : Jul 8, 2020, 9:15 PM IST

Updated : Jul 9, 2020, 3:15 AM IST

21:12 July 08

కరోనా చికిత్సకు ఫీజు ఖరారు చేసిన ఆరోగ్యశాఖ

కరోనా సోకినవారికి ఇక నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ... ఉచిత వైద్యం అందనుంది. ఆరోగ‌్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో అందించే చికిత్సకు సంధించిన ఫీజుల్ని వైద్య, ఆరోగ్యశాఖ ఖరారు చేసింది. బాధితులకు అందించే వైద్యం ఆధారంగా రోజువారీ ఫీజులను కనిష్టంగా రూ.3250 గరిష్ఠంగా 10,380 రూపాయలుగా నిర్ధరించారు. ఈ మొత్తాన్ని..... రోగుల తరపున ఆరోగ్యశ్రీ ట్రస్టు చెల్లించనుంది.

రోగులపై భారం పడకుండా..

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చిన ప్రభుత్వం ఫీజుల నిర్ధరణపై ఉన్నతస్థాయి సాంకేతిక  కమిటీ ప్రతిపాదించిన  ఫీజులను  ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైరస్ సోకినా ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేనివారికి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తే... రోజుకు 3250 రూపాయల ఫీజు నిర్ణయించారు. ఐసీయూలో ఉన్నవారికి వెంటిలేటర్ అవసరం లేకుంటే రోజుకు 5480 రూపాయలుగానూ... ఎన్​ఐవీ-నాన్ ఇమేజివ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే 5,980 రూపాయలుగానూ ఖరారు చేశారు. ఐసీయూలో వెంటిలేటర్‌తో చికిత్స అందిస్తే... ఫీజును 9 వేల 580 రూపాయలుగా  నిర్ణయించారు. ఆరోగ్యం బాగా క్షీణించినవారు ఐసీయూలో ఉన్నా వెంటిలేటర్ లేకుండా చికిత్స అందిస్తే 6280 రూపాయల ఫీజు ఖరారు చేశారు. ఆరోగ్యం బాగా క్షీణించినవారికి ఐసీయూలో వెంటిలేటర్‌తో చికిత్స అందిస్తే ఆస్పత్రులు 10 వేల 380 రూపాయలు వసూలు చేయనున్నాయి. చికిత్స భారం రోగులపై పడకుండా ఆరోగ్యశ్రీ ట్రస్టు చెల్లించనుంది.  

నిర్దేశిత ఫీజులు

ఆరోగ్యశ్రీ పరిధిలో లేని ఆస్పత్రుల్లో రోగులు చేరితే ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులనే వసూలు చేయాలని వైద్యారోగ్యశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నోటీసు బోర్డుల్లో ఫీజుల వివరాలను స్పష్టంగా ప్రకటించాలని ఆదేశించింది. నాన్‌ ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో అదనంగా రోజుకు ప్రైవేటు రూం కింద 600 రూపాయలు పీపీఈ కిట్లు, వైరస్ నిర్ధరణ పరీక్షలకు చెల్లించాల్సిన ఫీజులు వేర్వేరుగా ఉండనున్నాయి.

ఇదీ చదవండి :  రమేశ్ ఆసుపత్రికి అచ్చెన్నాయుడు.. పోలీసుల భారీ బందోబస్తు


 

Last Updated : Jul 9, 2020, 3:15 AM IST

ABOUT THE AUTHOR

...view details