ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యాసంస్థలపై కరోనా కాటు.. ఉపాధ్యాయులపై కోలుకోలేని దెబ్బ - undefined

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా... రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యా సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విద్యార్థుల ఫీజులతో నడిచే పాఠశాలలు మహమ్మారి దెబ్బకు మూతపడ్డాయి. దీంతో స్కూళ్లకు రావాల్సిన ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఫలితంగా.. ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి. మరోవైపు... ఉపాధిపై తీవ్ర ప్రభావం పడటంతో తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేక అల్లాడుతున్నారు.

corona effect on private schools
విద్యాసంస్థలపై కరోనా ప్రభావం

By

Published : Jun 17, 2020, 6:01 AM IST

కరోనా కారణంగా... రాష్ట్రంలో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో విద్యార్థుల కోసం ఆన్​లైన్ పాఠాలంటూ యాజమాన్యాలు హడావిడి చేస్తున్నాయి. ఓ వైపు ఆన్​లైన్ పాఠాలు అందరికీ అర్థం కావటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అందరికీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్​టాప్​లు లేకపోవటం. ఉన్నా ఇంటర్నెట్ లేకపోవటం, నెట్​వర్క్ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఆన్​లైన్ క్లాసులు నిర్వహిస్తూ... ఫీజులు చెల్లించండంటూ... యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఎంత ఒత్తిడి తెస్తున్నా... పెద్దగా ఫలితం లేదని యాజమాన్యాలు వాపోతున్నాయి. దీంతో సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు.

తల్లిదండ్రుల కష్టాలు
విద్యాసంస్థలపై కరోనా కాటు

వచ్చే విద్యా సంవత్సరానికిగాను అడ్మిషన్లు చేయించాలని ఉపాధ్యాయులపై యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. అడ్మిషన్లు చేయిస్తే... జీతాలు చెల్లిస్తామని లేదంటే లేదని బెదిరిస్తున్నాయి. తమకు జీతాలు సరిగ్గా అందడం లేది ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లుగడవక... చాలా ఇబ్బందులుపడుతున్నామని వాపోతున్నారు.

ఉపాధ్యాయులపై కరోనా ప్రభావం

కరోనా ప్రభావంతో మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నారు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఒకవేళ ఉద్యోగం ఉన్నా.. సగం జీతాలు మాత్రమే తీసుకుంటున్నారు. కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో కనీసం బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి క్లిష్ట సమయాల్లో... ఇల్లు గడిస్తే చాలని భావిస్తున్నారు. పాఠశాలలు నడవకపోయినా.. ఫీజులు చెల్లించాలని అడగటం ఎంత వరకు సమంజసం అంటూ తల్లిదండ్రులు ధ్వజమెత్తుతున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకువచ్చి కట్టాలని ప్రశ్నిస్తున్నారు.

కరోనా అందరికీ ప్రాణసంకటంగా మారింది. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు గట్టెక్కుతారో తెలియటం లేదు. ఇలాంటి తరుణంలో... ప్రభుత్వాలు ఆదుకోవాలని ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది వేడుకుంటున్నారు.

For All Latest Updates

TAGGED:

pvt schools

ABOUT THE AUTHOR

...view details