ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: బ్యాంకు సిబ్బందిని భయపెడుతున్న కరోనా - latest news of bankers effect with corona

బ్యాంకు సిబ్బందిని కరోనా భయం వెంటాడుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 671 మంది బ్యాంక్ ఉద్యోగులు వైరస్ బారిన పడగా.. ఇద్దరు మరణించారు.

Telangana: Corona scaring bankers
తెలంగాణ: బ్యాంకర్లను భయపెడుతున్న కరోనా

By

Published : Jul 14, 2020, 5:19 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ... బ్యాంకింగ్‌ రంగాన్ని కొవిడ్‌ కుదిపేస్తోంది. రోజురోజుకు వైరస్​ బారిన పడుతున్న బ్యాంకర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా ఇద్దరు చనిపోగా... 671 మంది వైరస్ బారిన పడ్డారు. అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన 188 మంది, భారతీయ స్టేట్‌ బ్యాంకుకు చెందిన 104 మంది, ఇండియన్‌ బ్యాంకుకు చెందిన 80 మంది, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 56, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు చెందిన 55 మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు.

ఈ పరిణామంతో... విధులకు హాజరుకావడానికి బ్యాంకర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొందరు దీర్ఘకాలిక సెలవులు కూడా పెడుతున్నారు. హాజరైన వారు కూడా భయాందోళనతో తమ విధులు నిర్వర్తిస్తున్నారు. దూరం నుంచే ఖాతాదారులకు సేవలు అందిస్తున్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు రాగానే సంబంధిత బ్యాంకు బ్రాంచి రెండు, మూడు రోజులు మూసివేస్తున్నారు. పూర్తి స్థాయిలో శానిటైజ్‌ చేసిన తరువాత తిరిగి తెరుస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details