ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Corona Delta: 'భారత్​లో కరోనా డెల్టా వేరియంట్ వ్యాప్తి' - సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా

భారత్​లో కరోనా డెల్టా వేరియంట్ అత్యధికంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ అని సీసీఎంబీ సలహాదారు రాకేశ్ మిశ్రా తెలిపారు. వారణాసి పరిసర ప్రాంతాల్లో బెనారస్ హిందూ యూనివర్సిటీ, సీసీఎంబీ హైదరాబాద్​ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో తేలింది.

Corona Delta : 'భారత్​లో కరోనా డెల్టా వేరియంట్ వ్యాప్తి'
Corona Delta : 'భారత్​లో కరోనా డెల్టా వేరియంట్ వ్యాప్తి'

By

Published : Jun 5, 2021, 5:07 PM IST

భారత్​లో ప్రస్తుతం కరోనా డెల్టా వేరియంట్ అత్యధికంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ అని సీసీఎంబీ సలహాదారు రాకేష్ మిశ్రా అన్నారు. కొవిడ్ కొత్త వేరియంట్లపై వారణాసి పరిసర ప్రాంతాల్లో బెనారస్ హిందూ యూనివర్సిటీ, సీసీఎంబీ హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో 36 శాతం బీ 1.617.2 అకా డెల్టా వేరియంట్ ఉన్నట్లు తేలింది.

దక్షిణ ఆఫ్రికాలో మొదటిసారి వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ బి 1.351 కూడా ఆ ప్రాంతంలో గుర్తించినట్లు వెల్లడించారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న బి- 1.617.2 వేరియంట్​పై ప్రత్యేక దృష్టి పెట్టినా.. ఇతర వేరియంట్లపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details