ఏపీలో కొవిడ్ కేసుల పెరుగుదల, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టులో ఆలిండియా లాయర్స్ యూనియన్ పిల్ దాఖలు చేసింది. ఏపీలో పెరుగుతోన్న కేసులు, తీసుకోవాల్సిన చర్యలు, అందరికీ వ్యాక్సినేషన్,కొవిడ్ మందుల ధరల నియంత్రణపై లాయర్స్ యూనియన్ పిటిషన్‌లో ప్రస్తావించింది. కరోనాపేషెంట్లకు పడకలు అందుబాటులో లేవని పిటిషన్‌లో పేర్కొంది. రెమ్డెసివిర్ లాంటి ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్లో విక్రయంపై పిటిషన్‌లో యూనియన్ సభ్యులు ప్రస్తావించారు. కొవిడ్నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వ్యాజ్యంలో కోరారు.
కరోనా నియంత్రణ చర్యలపై ప్రభుత్వాన్ని ఆదేశించాలి.. హైకోర్టులో పిటిషన్
కొవిడ్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని.. ఆలిండియా లాయర్స్ యూనియన్ హైకోర్టులో వ్యాజ్యంలో దాఖలు చేసింది. ఏపీలో పెరుగుతోన్న కేసులు, తీసుకోవాల్సిన చర్యలు, అందరికీ వ్యాక్సినేషన్, కొవిడ్ మందుల ధరల నియంత్రణపై లాయర్స్ యూనియన్ పిటిషన్‌లో ప్రస్తావించింది.
All India Lawyers Union Petition in High Court