రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ తాజాగా 3,746 మందికి కొవిడ్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి బాధితుల సంఖ్య 7,93,299కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో మరో 27 మంది మృతి చెందారు. కాగా ఇప్పటివరకు వైరస్ కారణంగా 6,508 మంది ప్రాణాలు విడిచారు.
రాష్ట్రంలో కొత్తగా 3,746 కరోనా కేసులు, 27 మరణాలు
17:42 October 21
7,93,299కు చేరిన కరోనా బాధితుల సంఖ్య
ఇప్పటివరకు 7,54,415 మంది బాధితులు కోలుకోగా...ప్రస్తుతం 32,376 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 74,422 మందికి పరీక్షలు నిర్వహించగా...ఇప్పటివరకు మెుత్తం 72.71 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారు.
జిల్లాల వారీగా కేసులు...
పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 677కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా 503, చిత్తూరు 437, గుంటూరు 396, అనంతపురం 301, శ్రీకాకుళం 167, కడప 166, విశాఖ 138, విజయనగరం 134, ప్రకాశం 127, నెల్లూరు 116, కర్నూలు 65 కరోనా కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా మరణాలు...
కృష్ణా జిల్లాలో కరోనాతో మరో ఐదుగురు మృతి చెందారు. అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కడప, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు.