రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 5 లక్షలు దాటాయి. 24 గంటల వ్యవధిలో 8,368 కరోనా కేసులు నమోదు కాగా.. 70 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 5,06,493కు చేరగా.. 4,487 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 4,04,074 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 97,932 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 58,157 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 41,66,077 కరోనా పరీక్షలు చేపట్టారు.
రాష్ట్రంలో 5 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు - andhra pradesh corona
17:07 September 07
24 గంటల వ్యవధిలో 8,368 కరోనా కేసులు, 70 మంది మృతి
జిల్లాల వారీగా కరోనా కేసులు..
తూ.గో. జిల్లాలో అత్యధికంగా 1312 కరోనా కేసులు నమోదయ్యాయి. ప.గో. జిల్లాలో 950, నెల్లూరు జిల్లాలో 949, చిత్తూరు జిల్లాలో 875, గుంటూరు జిల్లాలో 765, విజయనగరం జిల్లాలో 594, అనంతపురం జిల్లాలో 584, శ్రీకాకుళం జిల్లాలో 559, కడప జిల్లాలో 447, ప్రకాశం జిల్లాలో 419, విశాఖ జిల్లాలో 405, కర్నూలు జిల్లాలో 316, కృష్ణా జిల్లాలో 193 కరోనా కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా కరోనా మృతులు..
24 గంటల్లో ప్రకాశం జిల్లాలో 10, గుంటూరు జిల్లాలో 9 మంది కరోనాతో మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 8, కడప జిల్లాలో ఏడుగురు, ప.గో. జిల్లాలో 7, కృష్ణా జిల్లాలో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో 5, అనంతపురం జిల్లాలో నలుగురు, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖలో నలుగురు, తూ.గో. జిల్లాలో ముగ్గురు మృతి చెందారు.