రాష్ట్రంలో కొత్తగా 6,341 కరోనా కేసులు, 57 మరణాలు నమోదు - covid cases

16:44 June 18
కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 6,341 కరోనా కేసులు, 57 మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా నుంచి మరో 8,486 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 67,629 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో 1,07,764 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కొవిడ్ కారణంగా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 12 మంది మృతి చెందారు. గుంటూరులో ఎనిమిది, తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు మరణించారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,247 కేసులు నమోదవ్వగా...చిత్తూరు జిల్లాలో 919, పశ్చిమ గోదావరి జిల్లాలో 791 కేసులు వచ్చాయి.
ఇదీ చదవండి:కర్ఫ్యూ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి: ముఖ్యమంత్రి