రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కొత్తగా 657 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15, 252కు చేరింది.
రాష్ట్రంలో కొత్తగా 657 కరోనా కేసులు.. ఆరుగురు మృతి - రాష్ట్రంలో కరోనా అప్ డేట్స్
13:10 July 01
రాష్ట్రంలో కొత్తగా 657 కరోనా కేసులు.. ఆరుగురు మృతి
తాజాగా నమోదైన వాటిలో రాష్ట్ర వాసులు 611 మంది ఉండగా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 39 మందికి వైరస్ సోకింది. ఇతర దేశాల నుంచి వచ్చిన ఏడుగురు మహమ్మారి బారిన పడ్డారు. కొత్తగా ఆరుగురు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 193కు చేరుకుంది. 8, 071 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 6,988 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. 24 గంటల వ్యవధిలో 28 వేల పైచిలుకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇవీ చదవండి..
'వైరస్ సోకినా.. హోం ఐసోలేషన్లో ఉండొచ్చు'