ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మరో 10,199 పాజిటివ్ కేసులు.. కోలుకున్న 9,499 మంది - undefined

corona cases today in andhrapradesh
corona cases today in andhrapradesh

By

Published : Sep 3, 2020, 5:55 PM IST

Updated : Sep 3, 2020, 6:24 PM IST

17:52 September 03

4, 65, 730కు పెరిగిన కోవిడ్ బాధితులు

రాష్ట్రంపై కరోనా ప్రభావం కొనసాగుతోంది. వరుసగా 8వ రోజూ.. 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే.. 10, 199 మందికి కరోనా సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 4, 65, 730కి చేరింది. తాజాగా.. 75 మంది మరణించగా.. 4,200కు మృతుల సంఖ్య పెరిగింది.

అలాగే.. 9,499 మంది కోవిడ్ బాధితులు.. కోలుకున్నారు. వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య.. మొత్తంగా 3,57,829కి పెరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో..1,03,701 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 62, 225 పరీక్షలు నిర్వహించగా.. మొత్తం నిర్ధరణ పరీక్షల సంఖ్య.. 39,05,775కు చేరింది.

జిల్లాల వారీగా మృతులు

గడచిన 24 గంటల్లో.. కరోనా కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది చనిపోయారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో 9 మంది చొప్పున... అనంతపురం, కృష్ణా, ప.గో. జిల్లాల్లో ఏడుగురు చొప్పున... నెల్లూరులో 6.. కడపలో 5.. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున... ప్రకాశం జిల్లాలో ముగ్గురు.. విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

జిల్లాల వారీగా కేసులు

ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,090 కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 982.. ప్రకాశంలో 926.. కడపలో 898.. చిత్తూరులో 885.. అనంతపురంలో 854.. పశ్చిమ గోదావరిలో 836.. గుంటూరులో 805.. శ్రీకాకుళంలో 717.. విశాఖలో 695.. కర్నూలులో 616.. విజయనగరంలో 577.. కృష్ణాలో 318 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:

'ప్లాన్​ బీ' వ్యాక్సిన్​తో కరోనాకు చెక్​!

Last Updated : Sep 3, 2020, 6:24 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details