ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: పెరుగుతున్న కరోనా కేసులు.. రాజధానిలోనే 47 మందికి వైరస్ - telangana covid cases news

తెలంగాణలో కొవిడ్​ కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. తాజాగా మరో 313 మంది వైరస్​ బారిన పడగా.. మొత్తం బాధితుల సంఖ్య 3,02,360కు చేరింది. రాష్ట్రంలో గురువారం 62,972 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

corona cases at Telangana
corona cases at Telangana

By

Published : Mar 19, 2021, 11:23 AM IST

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మరో 313 మందికి వైరస్​ సోకింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 47 కరోనా బారిన పడ్డారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 3,02,360కు చేరింది. కొవిడ్​ కోరల్లో చిక్కుకొని మరో ఇద్దరు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1, 664కు చేరింది.

కరోనా నుంచి కోలుకొని మరో 142 మంది బాధితులు ఇళ్లకు చేరారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,434 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్‌లో 943 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో గురువారం.. 62,972 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇవీచూడండి:కొవిడ్ విజృంభణ-కొత్తగా 40వేల కేసులు

ABOUT THE AUTHOR

...view details