తెలంగాణలో గురువారం కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఇద్దరు వైద్యులు కాగా.. నలుగురిలో ముగ్గురికి రెండో దశలో కొవిడ్- 19 సోకినట్లు అధికారులు వివరించారు. ఈ నలుగురితో కలుపుకొని తెలంగాణలో మొత్తం కేసులు సంఖ్య 45కు చేరింది. వీరిలో 44 మంది చికిత్స పొందుతున్నారు. మరొకరు డిశ్చార్జి అయ్యారు. నిన్నటి కేసుల్లో ఇద్దరు దిల్లీ నుంచి రాగా మిగిలిన ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వైద్యులు. భార్యాభర్తలైన ఇద్దరు వైద్యులు... ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి వచ్చినట్టు.. వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
107 మందికి పరీక్షలు...
ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో పనిచేసే వీరు ఈనెల 14 నుంచి 16 వరకు సెలవులపై ఇంట్లోనే ఉన్నారు. 17న విమానంలో తిరుపతిలో ఓ వైద్యుడిని కలిసి తిరిగి హైదరాబాద్‌కి వచ్చారు. తర్వాత రెండు రోజులపాటు ఇంట్లోనే ఉన్నారు. 20న విధులకు వెళ్లి ఆరోగ్యం బాలేక గంటలోనే భర్త తిరిగి ఇంటికి రాగా.. 21న అతడికి చేసిన పరీక్షల్లో పాజిటివ్ తేలింది. భార్యకి వ్యాధి సోకినట్టు గుర్తించారు. ఇక మిగిలిన ఇద్దరిలో ఒకరు.. 45 ఏళ్లు, మరొకరు 49 ఏళ్ల వ్యక్తులు కాగా.. హైదరాబాదీలైన వీరు ఇటీవలే దిల్లీ నుంచి వచ్చినట్టు... వైద్యులు గుర్తించారు. వీరిలో ఒకరు సికింద్రాబాద్, మరొకరు కుత్బుల్లాపూర్ వాసిగా ప్రభుత్వం ప్రకటించింది. నిన్న మొత్తం 107మందికి పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం 25 మంది ఫలితాలు వెల్లడించింది.
కరోనా కోసం గాంధీ ఆస్పత్రి...