రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కు చేరింది. శుక్రవారం రాత్రి 10.30 గంటల నుంచి శనివారం ఉదయం 10 వరకు కొత్తగా 16 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా...ఇప్పటివరకు 27 కరోనా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా... మొత్తం కేసులు 23కు చేరాయి. గుంటూరు జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 23 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా... మొత్తం కేసులు 4కు చేరాయి. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఇవాళ ఒక్కో కరోనా కేసు నమోదైంది.
రాష్ట్రంలో 180 కరోనా పాజిటివ్ కేసులు - corona cases reached 180 in ap
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కు చేరింది. శుక్రవారం రాత్రి 10.30 గంటల నుంచి శనివారం ఉదయం 10 వరకు కొత్తగా 16 కరోనా కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో 180కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు