రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25,542 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 114 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,85,824 కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.
రాష్ట్రంలో కొత్తగా 114 కరోనా కేసులు.. తగ్గిన మరణాలు - కొవిడ్ తాజా సమాచారం
రాష్ట్రంలో కొత్తగా మరో 114 మందికి కరోనా సోకింది. 24 గంటల వ్యవధిలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని.. వైద్యారోగ్య శాఖ బులెటిన్లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు
శుక్రవారం(15.01.21) వరకు మొత్తం మరణాల సంఖ్య 7,139గా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 326 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. వీరితో కలిపి రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,76,698కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,987 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చదవండి:దిల్లీ పారిశుద్ధ్య కార్మికుడికి తొలి టీకా