కరోనా ఇక రాదనే నిర్లక్ష్యం.. అజాగ్రత్తే ముప్పు తెచ్చిపెడుతోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ పడగ విప్పుతుండటంతో పదిరోజుల్లో పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే దక్షిణాదిలో కరోనా వైరస్ చాలా రకాలుగా ఉత్పరివర్తనం చెందినట్లు సీసీఎంబీ స్పష్టం చేసింది.
నిర్లక్ష్యంతోనే పెరుగుతున్న కరోనా కేసులు..! - హైదరాబాద్ లేటెస్ట్ వార్తలు
చాలా మంది నిర్లక్ష్యంతో మాస్కులు ధరించడం లేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం లేదు. ఫలితంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ పడగ విప్పుతుండటంతో పదిరోజుల్లో పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది.
అంతేకాక గతంలో కరోనా సోకిన వారిలో కొన్నినెలల వరకు యాంటీబాడీలు పనిచేస్తాయి. నగరంలో తొలి కేసు నమోదై దాదాపు ఏడాది కావస్తోంది. ఫలితంగా కరోనా వచ్చి తగ్గిన వారిలో చాలామందిలో యాంటీబాడీలు కొంత వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. ఈనేపథ్యంలో మళ్లీ వారిలో కరోనా వచ్చే ముప్పు ఉంది. ముఖ్యంగా 20-50 ఏళ్లలోపు వారిలో ఎక్కువ నిర్లక్ష్యం కన్పిస్తోంది. వారితో ఇంట్లో పెద్దలకు వైరస్ సులువుగా సోకుతుంది. ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉందంటే.
- ఎర్రగడ్డ, మెహిదీపట్నం, కూకట్‌పల్లి రైతుబజార్లు, గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్‌లలో రద్దీ నెలకొన్నా చాలామంది మాస్క్‌లు ధరించడం లేదు.
- కూకట్‌పల్లి, సికింద్రాబాద్, అమీర్‌పేట, బేగంపేట, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, మెహిదీపట్నంలో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, హోటళ్లు, బార్‌లు కిటకిటలాడుతున్నాయి. ఎడం పాటించడం లేదు.
- ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌ల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. బస్టేషన్లు, రైల్వేస్టేషన్లలో కొవిడ్ నిబంధనలను పట్టించుకోవడం లేదు.
- గతంలో ప్రతిఒక్కరి చేతిలో శానిటైజర్లుండేవి. ప్రతి పావుగంటకు చేతులు శుభ్రం చేసుకునేవారు. మాల్, సంస్థ లోపలకు వెళ్లేముందు థర్మల్ స్క్రీనింగ్ చేసేవారు. చాలాచోట్ల ఇప్పుడదీ జరగడం లేదు.
ఇదీ చదవండి:చాముండీ పాత్రలో లీనమై 'మహీషుడి'పై హత్యాయత్నం