తెలంగాణలో శుక్రవారం రికార్డు స్థాయిలో 4,446 పాజిటివ్ కేసులు నమోదు కాగా 12 మంది మరణించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో దాదాపు 11 శాతం ఈ ఏప్రిల్ నెలలోనే వచ్చాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. శుక్రవారం నాటికి మొత్తం కేసులు 3,46,331గా ఉంటే.. ఇందులో దాదాపు 11 శాతం 37,555 కేసులు ఈనెల 1 నుంచి 16 వరకు నమోదైనవే. చికిత్స నుంచి 1,414 మంది కోలుకోవడంతో కోలుకున్నవారి సంఖ్య 3,11,008కి చేరింది. ప్రస్తుతం 33,514 మంది చికిత్సలో ఉన్నారు.
గత నెలాఖరు నాటికి మరణాల సంఖ్య 1,701గా ఉంటే.. శుక్రవారానికి 1,809కి చేరింది. గత 16 రోజుల్లో 108 మంది చనిపోయారు. ఈ నెలలో రెండోదశ తీవ్రంగా ఉండటంతో వైద్య ఆరోగ్యశాఖ పరీక్షలు పెంచింది. ఈనెల 12న 1.13 లక్షల నమూనాలు పరిశీలిస్తే 3,052 కేసులు వచ్చాయి. శుక్రవారం 1.26 లక్షలు పరిశీలిస్తే 4,446 పాజిటివ్‌లు వచ్చాయి.
- కొత్తకేసులు 4,446
- మొత్తం కేసులు 3,46,331
- మరణాలు 1,809
జిల్లాల్లోనూ కేసుల వరద..