ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తల్లడిల్లుతున్న పల్లె.. రాకపోకలు పెరగడమే కారణం! - Corona Positive rate increased in AP

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. పట్టణాల కంటే పల్లెల్లోనే వేగంగా విస్తరిస్తోంది. రాకపోకలు పెరగడంతో వ్యాప్తి తీవ్రంగా పెరుగుతోంది. మొత్తంగా మే 2వ వారంలో 23.34 శాతం పాజిటివిటీ నమోదైంది.

Corona cases increased in villages
తల్లడిల్లుతున్న పల్లె

By

Published : May 19, 2021, 7:10 AM IST

రాష్ట్రంలో కరోనా దూకుడు కొనసాగుతూనే ఉంది. వారాలు గడుస్తున్నా వైరస్‌ వ్యాప్తి ఆగడంలేదు. అయితే ప్రస్తుతం పట్టణాల కంటే పల్లెల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఏప్రిల్‌ తొలివారంలో పట్టణాలు/నగరాల్లో 60% కేసులు నమోదయ్యాయి. పల్లెల్లో 40% వచ్చాయి. తాజాగా దీనికి భిన్నంగా పట్టణాల్లో 44%, పల్లెల్లో 57% కేసులొచ్చాయి. రాకపోకలు పెరిగిపోతుండడంతో పల్లెల్లో వ్యాప్తి తీవ్రంగా ఉంటోంది.

ఈనెల 5 నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చినప్పటికీ కేసుల నమోదుపై తగిన ప్రభావం కనిపించలేదు. ఏప్రిల్‌ 1 నుంచి మే 16 వరకుచూస్తే కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత వారంలో 38.79% కేసుల నమోదుతో తూ.గో.జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 10.98% కేసులతో కృష్ణా జిల్లా చివరి స్థానంలో ఉంది. ఏప్రిల్‌ 1 నుంచి 7వ తేదీ మధ్య రాష్ట్రంలో 2,19,404 నమూనాలను పరీక్షించగా 5.14% పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మే 8 నుంచి 16వ తేదీ మధ్య 8,14,435 నమూనాలను పరీక్షించగా 23.34% పాజిటివిటీ రికార్డయింది.

ఏప్రిల్‌ తొలివారంలో ఈ 3 జిల్లాల్లో అత్యధికం

ఏప్రిల్‌ తొలి వారంలో అత్యధికంగా వైరస్‌ కేసులు నమోదైన తొలి 3 జిల్లాల్లో గుంటూరు, విశాఖపట్నం, చిత్తూరు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 26,927 నమూనాలను పరీక్షించగా 2,304 (8.56%) కేసులు బయటపడ్డాయి. విశాఖలో 19,179కు 1,591 (8.30%), చిత్తూరు జిల్లాలో 23,518కు 1,939 (8.24%) కేసులు నమోదయ్యాయి.

మే నెలలో..

మే1 నుంచి ఏడో తేదీ వరకు పాజిటివిటీ రేటు తూర్పుగోదావరి (32.94), శ్రీకాకుళం (26.84), కర్నూలు (26.78)లో నమోదయ్యాయి. మే 8 నుంచి 16వ తేదీ మధ్య అత్యధికంగా కేసులు నమోదైన 3 జిల్లాల్లో తూర్పుగోదావరి, అనంతపురం, కడప ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 64,663 నమూనాలను పరీక్షించగా 25,083 (38.79%) మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. అనంతపురం జిల్లాలో 52,127 నమూనాలను పరీక్షించగా 19,220 (36.87%) మందికి వైరస్‌ వచ్చింది. కడప జిల్లాలో 47,719 నమూనాలను పరీక్షించారు. 13,509 (28.31%) మందికి వైరస్‌ సోకింది.

కృష్ణా జిల్లాలో..

* ఏప్రిల్‌ తొలివారంలో 21,559 నమూనాలను పరీక్షించగా 1,406 (6.52%) కేసులు వచ్చాయి.

* ఏప్రిల్‌ 8 నుంచి 14 మధ్య 18,128 నమూనాలను పరీక్షించారు. వీటి ద్వారా 1,791 (9.88%) మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు.

* ఏప్రిల్‌ 15 నుంచి 21 మధ్య 18,835 నమూనాలను పరీక్షించగా 2,506 (13.31%) మందికి వైరస్‌ సోకింది.

* ఏప్రిల్‌ 22 నుంచి 30 మధ్య 44,536 నమూనాలను పరీక్షించారు. 5,417 (12.16%) మందికి వైరస్‌ నిర్ధారణ అయింది.

* మే 1 నుంచి 7వ తేదీ మధ్య 65,274 నమూనాలను పరీక్షించగా 6,137 (9.40%) మందికి వైరస్‌ సోకింది.

* మే 8 నుంచి 16వ తేదీ మధ్య 79,007 నమూనాలను పరీక్షించారు. వీటిలో 8,678 (10.98%) మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది.

ABOUT THE AUTHOR

...view details