రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 90,204 పరీక్షలు నిర్వహించగా.. 2,591 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఫలితంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 19,29,579 మంది వైరస్ బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,057కి చేరింది. 24 గంటల వ్యవధిలో 3,329 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,90,565కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,957 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,32,20,912 మంది నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 2,591 కరోనా కేసులు - ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు
![CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 2,591 కరోనా కేసులు కరోనా కేసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12457535-511-12457535-1626263881253.jpg)
కరోనా కేసులు
17:05 July 14
గడిచిన 24 గంటల్లో 15 మంది మృతి
Last Updated : Jul 14, 2021, 5:39 PM IST