తెలంగాణలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. హైదరాబాద్‌తోపాటు... జిల్లాల్లోనూ వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతోంది. కొత్తగా రాష్ట్రంలో 1,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79 వేల 495కు చేరింది. వైరస్ బారిన పడి తాజాగా 12 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 627 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
తెలంగాణలో కొత్తగా 1,982 కరోనా కేసులు - కరోనా వార్తలు
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. హైదరాబాద్‌తోపాటు.. జిల్లాల్లోనూ వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతోంది. కొత్తగా 1,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 79 వేల 495కు చేరింది.
తెలంగాణలో కొత్తగా 1,982 కరోనా కేసులు
కొవిడ్ నుంచి 55, 999 మంది బాధితులు కోలుకోగా... 22, 869 మంది వైరస్‌తో పోరాడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 463 పాజిటివ్ కేసులతో మొదటిస్థానంలో ఉండగా... మేడ్చల్ 141, రంగారెడ్డి 139 కేసులతో తరువాత స్థానంలో ఉన్నాయి. కరీంనగర్ 96, జోగులాంబ గద్వాల 93, జనగామ 78, పెద్దపల్లి, వరంగల్ అర్బన్‌లో 71 మంది వైరస్ బారిన పడ్డారు.
ఇదీ చదవండి: కొవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుకుచేరిన మృతుల సంఖ్య