తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 891 కేసులు నమోదయ్యాయి. వీటితో కేసుల సంఖ్య 10వేలు దాటింది. మొత్తం బాధితుల సంఖ్య 10,444కు చేరింది. తాజాగా 5 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు వైరస్ బారిన పడి 225 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 4,361 మంది డిశ్చార్జయ్యారు. ఆసుపత్రుల్లో 5, 858 మంది చికిత్స పొందుతున్నారు.
ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే బుధవారం 719 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్ జిల్లాలో 55, భద్రాద్రి కొత్తగూడెంలో 6, ఖమ్మంలో 4, వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణ జిల్లాల్లో 3, సంగారెడ్డి, కరీంనగర్, నల్గొండల్లో 2 కేసుల చొప్పున వెలుగుచూశాయి. కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, గద్వాల, పెద్దపల్లి, సూర్యాపేట, నిజామాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదయ్యాయి.