తెలంగాణలో 644కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు - coronavirus updates
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 644కు చేరింది. ఇవాళ కొత్తగా 52మంది వైరస్ బారిన పడినట్లు ప్రభుత్వం వెల్లడించిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
corona-cases-in-telangana-644
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 52మంది వైరస్ బారిన పడగా... ఇప్పటివరకు మెుత్తం కేసుల సంఖ్య 644కు చేరింది. ఈరోజు ఒకరు కరోనా వైరస్‌తో మృతి చెందగా... మెుత్తం మృతుల సంఖ్య 18కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 516 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఏడుగురు డిశ్చార్జ్ కాగా... ఇప్పటి వరకు డిశ్చార్జ్ 110 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.