రాష్ట్రంలో కొత్తగా 837 కరోనా కేసులు
12:41 July 03
రాష్ట్రంలో కొత్తగా 837 కరోనా కేసులు, 8 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. 24గంటల వ్యవధిలో కొత్తగా 837మందికి కరోనా సోకింది. ఇందులో రాష్ట్రానికి చెందిన 789 మందికి ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన 46మందికి, ఇతర దేశాలనుంచి ఏపీకి వచ్చిన మరో ఇద్దరికి కోవిడ్ నిర్ధరణ అయ్యింది. కరోనాతో మరో 8 మంది మృతి చెందారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 16వేల 934 కరోనా కేసుల నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో 38వేల 898 మందికి నిర్ధరణ పరీక్షలు చేశారు. 9లక్షల 71వేల 611 నమూనాలను పరీక్షించారు. గడిచిన 24గంటల్లో కర్నూలులో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ కరోనా కారణంగా నమోదైన మరణాల సంఖ్య 206కు పెరిగింది.
ఇప్పటివరకూ రాష్ట్రంలో 7వేల 632మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 9096 మంది వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.