రాష్ట్రంలో 3 లక్షలు దాటాయ్.. కొత్తగా 9,652 కరోనా కేసులు - corona cases in august 18th in ap news
![రాష్ట్రంలో 3 లక్షలు దాటాయ్.. కొత్తగా 9,652 కరోనా కేసులు corona cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8465275-932-8465275-1597751105575.jpg)
17:15 August 18
16:39 August 18
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 9,652 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,06,261కు చేరింది. వైరస్ బారిన పడి మరో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ మొత్తం మరణాల సంఖ్య 2,820కు చేరింది.
రాష్ట్రంలో కరోనా నుంచి 2,18,311 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 85,130 యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవదిలో 56,090 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 29.61 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేశారు.
ఇదీ చూడండి..