ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 182 కరోనా కేసులు, ఒకరు మృతి

AP corona cases: రాష్ట్రంలో కొత్తగా 182 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,985 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

CORONA CASES IN ANDHRA PRADESH
రాష్ట్రంలో కొత్తగా 182 కరోనా కేసులు

By

Published : Feb 21, 2022, 6:33 PM IST

AP corona cases: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 14,249 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 182 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ సోకి ఒకరు మరణించారు. కరోనా బారి నుంచి తాజాగా 950 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,985 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

  • దేశంలో భారీగా తగ్గిన కేసులు.. కొత్తగా 16 వేల మందికి వైరస్​
    India covid cases: దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య 20వేల లోపునకు పడిపోయింది. కొత్తగా 16,051‬ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 206 మంది మరణించారు. 37,901 మంది కోలుకున్నారు.
  • మొత్తం కేసులు: 4,28,38,524‬
  • మొత్తం మరణాలు: 5,12,109
  • యాక్టివ్ కేసులు: 2,02,131
  • మొత్తం కోలుకున్నవారు: 4,21,24,284

Vaccination in India:దేశంలో వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం మరో 7,00,706 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,75,46,25,710కు చేరింది.

World Covid cases:ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఆందోళకరంగానే ఉంది. 24 గంటల వ్యవధిలో 12,79,979 కేసులు బయటపడ్డాయి. రష్యా, జర్మనీ, బ్రెజిల్, దక్షిణ కొరియా దేశాల్లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

  • రష్యాలో తాజాగా లక్షా 70 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 745 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 53 లక్షలు దాటింది.
  • జర్మనీలో 1.4 లక్షల కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 65 మంది కరోనాకు బలయ్యారు.
  • బ్రెజిల్​లో రోజువారీ కరోనా మరణాలు సంఖ్య భారీగా ఉంటోంది. 24 గంటల వ్యవధిలో 424 మంది చనిపోయారు. కొత్తగా 40,625 కేసులు వెలుగుచూశాయి.
  • దక్షిణ కొరియాలోనూ లక్షకు పైగా కొవిడ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. 51 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
  • జపాన్, టర్కీ, ఫ్రాన్స్, ఇండోనేసియా దేశాల్లోనూ వైరస్ విజృంభణ తీవ్రంగా కొనసాగుతోంది.

ఇదీ చదవండి:

కొత్త పద్ధతిలో పంచ్ ప్రభాకర్ వీడియోలు.. తొలగించాలని యూట్యూబ్​కు ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details