corona cases: కొత్తగా 2,107 కరోనా కేసులు, 20 మరణాలు - ఏపీలో కొత్తగా కరోనా కేసులు
16:23 July 29
corona cases
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 78,784 పరీక్షలు నిర్వహించగా.. 2,107 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఫలితంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 19,62,049 మంది వైరస్ బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 20 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో కృష్ణాలో నలుగురు; చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. ఈ మహమ్మారి కారణంగా తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. అలాగే వైఎస్ఆర్ కడప, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చి మగోదావరి జిల్లాల్లో ఒక్కొ క్క రు చొప్పున మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,279 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చదవండీ..Disha: బోధనాస్పత్రుల్లో దిశ వన్ స్టాఫ్ సెంటర్లు: మంత్రి సుచరిత