రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 796 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,285కు చేరింది. కొత్త కేసుల్లో రాష్ట్రానికి చెందినవారు 740 మంది ఉండగా... ఇతర రాష్ట్రాలవారు 51 మంది, ఇతర దేశాలకు చెందినవారు ఐదుగురు ఉన్నారు.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 796 కరోనా కేసులు.. 11 మంది మృతి
13:33 June 27
రాష్ట్రంలో కొత్తగా 796 కరోనా కేసులు.. 11 మంది మృతి
రాష్ట్రంలో కొవిడ్‌తో 11 మంది మృతి చెందారు. మొత్తం ఇప్పటివరకూ 157 మంది కరోనాతో మరణించారు. 6,648 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ నుంచి కోలుకుని 5,480 మంది ఇళ్లకు వెళ్లారు.
అత్యధికంగా అనంతపురం జిల్లాలో 161 మందికి కరోనా సోకినట్టు ప్రభుత్వం పేర్కొంది. తూర్పుగోదావరిలో 109, చిత్తూరులో 84, గుంటూరులో 71, కడప 50, కృష్ణా 53, కర్నూలు 69, నెల్లూరు 24, ప్రకాశం 26, విశాఖ 34, విజయనగరం 15, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 44 మందికి కరోనా పాజిటివ్ సోకినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో కర్నూలులో నలుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విజయనగరంలో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
ఇవీ చదవండి:
పిల్లలు పుట్టలేదని భర్త చిత్రహింసలు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య