AP Corona Cases: కొత్తగా 1,546 కరోనా కేసులు.. 18 మరణాలు - కొవిడ్ కేసులు తాజా సమాచారం
17:00 August 03
Corona cases
రాష్ట్రంలో కొత్తగా 1,546 కరోనా కేసులు, 18 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 69,606 మంది నమూనాలు పరీక్షించగా 1,546 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 1,940 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21,198 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది.
కొవిడ్ కారణంగా.. చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు మృతి చెందగా.. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరులో ఇద్దరు చొప్పున మరణించారు. ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
ఇదీ చదవండీ..License: వాహన చట్టాన్ని ఉల్లంఘిస్తున్న విజయవాడ పోలీసులు..!