ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

New Corona Cases in AP : రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు...ఒకే అంకెకు పరిమితం..

AP CORONA CASES: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడ్డాయి. కరోనా ఉద్ధృతి తర్వాత తొలిసారిగా 5 మాత్రమే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

New Corona Cases in AP
New Corona Cases in AP

By

Published : Mar 29, 2022, 8:46 PM IST

రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు...ఒకే అంకెకు పరిమితం..

AP CORONA CASES: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడ్డాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 8,219 కరోనా పరీక్షలు నిర్వహించగా కేవలం 5 మాత్రమే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ఉద్ధృతి తర్వాత తొలిసారిగా ఇన్ని తక్కువ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారి నుంచి మరో 37 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 314 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

దేశంలో కొత్తగా 1,259 కరోనా కేసులు
Covid Cases India: దేశంలో రోజువారీ కొవిడ్​ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కొత్తగా 1,259 మందికి వైరస్​ సోకింది. మరో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,705 మంది వైరస్​ను జయించారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ జోరుగా సాగుతోంది. సోమవారం మరో 25,92,407 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,83,53,90,499కు పెరిగింది.

మొత్తం కేసులు:4,30,21,982

  • మొత్తం మరణాలు:5,21,070
  • యాక్టివ్​ కేసులు:15,378
  • కోలుకున్నవారు:4,24,85,534

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందంటే:ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అన్ని దేశాల్లో కలిపి మరో 9,39,991 కొత్త కేసులు వెలుగు చూశాయి. 2,780 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 48,30,35,119కు చేరగా.. మృతుల సంఖ్య 61,51,470కు పెరిగింది. కరోనా ప్రభావం జర్మనీలో అత్యధికంగా ఉంది. అక్కడ కొత్తగా 2,14,035 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య రెండు కోట్లు దాటింది.

దేశం కొత్త కేసులు కొత్త మరణాలు మొత్తం కేసులు మొత్తం మరణాలు
1 దక్షిణ కొరియా 1,87,213 287 1,20,03,054 15,186
2 వియత్నాం 1,20,000 70 90,11,473 42,306
3 జర్మనీ 2,14,035 159 2,04,65,072 1,29,106
4 ఫ్రాన్స్​ 29,455 124 2,50,59,028 1,41,821
5 ఇటలీ 30,710 95 1,43,96,283 1,58,877

ఇదీ చదవండి :Bus and Bike Accident: బస్సు కిందకు దూసుకెళ్లిన బైక్..

ABOUT THE AUTHOR

...view details