రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 212 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరిలో ఇద్దరు, గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా మహమ్మారికి బలయ్యారు. విజయనగరం జిల్లాలో వరుసగా రెండోరోజు ఒక్క కేసూ నమోదు కాలేదు. 8 రోజుల్లో 30 కరోనా కేసులే నమోదయ్యాయి.
శాంతిస్తున్న మహమ్మారి.. కొత్తగా 212 కరోనా కేసులు - ఏపీలో కరోనా కేసులు అప్డేట్స్
రాష్ట్రంలో కరోనా మహమ్మారి శాంతిస్తోంది. తాజాగా 212 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,81,273కు చేరింది. ప్రస్తుతం 3,423 మంది చికిత్స పొందుతున్నారు.
ఏపీలో కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 8,81,273కు చేరింది. ఇప్పటివరకు 7,980 మంది మహమ్మారికి బలయ్యారు. కొత్తగా 410 మంది కోలుకోగా.. ప్రస్తుతం 3,423 మంది చికిత్స పొందుతున్నారు. 24 గంటల వ్యవధిలో 37,381 కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చదవండి: ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ: సీఎం జగన్