రాష్ట్రంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోేనా ap covid cases: రాష్ట్రంలో గత 24 గంటల్లో 12,810 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 69 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 139 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి 817 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 3,32,01,596 సాంపిల్స్ని పరీక్షించారు.
దేశంలో 662 రోజుల కనిష్ఠానికి కరోనా కేసులు
Covid Cases in India: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 3,993 కేసులు నమోదు కాగా.. 8,055 మంది కోలుకున్నారు. 108 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 49,948గా ఉంది. 662 రోజుల తర్వాత మళ్లీ ఇంత తక్కువ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.
- మొత్తం కేసులు: 4,29,71,308
- మొత్తం మరణాలు: 5,15,210
- యాక్టివ్ కేసులు: 49,948
- కోలుకున్నవారు: 4,24,06,150
world corona cases: ప్రపంచవ్యాప్తంగా 12,08,581 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,78,26,370కు చేరింది. కొత్తగా మరో 4,829 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 60,26,879కు చేరుకుంది. మరోవైపు కొత్తగా 17,90,673 మంది కోలుకున్నారు.
- జర్మనీలో కొత్తగా 1,22,895 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 1,68,700 మంది వైరస్ను జయించారు.
- అమెరికాలో కొత్తగా 25,751 కేసులు నమోదయ్యాయి. 508 మంది మహమ్మారికి బలయ్యారు.
- రష్యాలో తాజాగా 73,162 కరోనా కేసులు నమోదయ్యాయి. 668 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో కొత్తగా 20,456 మందికి వైరస్ సోకగా.. 211 మంది మృతిచెందారు.
ఇదీ చదవండి: Somu veerraju: అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వని పార్టీ పాలన సాగిస్తోంది: సోము వీర్రాజు